నవాబ్‌పేట, జనవరి 31 : మారుమూల గ్రామాల నుంచి ప్రభుత్వపాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయా ణం ప్రాణసంకటగా మారింది. సరైన రవాణ సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేక రోడ్ల వెంబడి ఏ వాహనం వస్తే అది ఎక్కి భయ భయంగా ప్రయాణిస్తున్నారు. ఇందుకు అద్దం పట్టే ఘటన లింగంపల్లి గ్రామశివారులో దర్శనమిచ్చింది.
ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… నవాబ్‌పేట మండలం లింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్సీపూర్, ఊరంచుతండా, కుత్నేపల్లి చెం దిన విద్యార్థులు నడుచుకుంటు వస్తారు. శుక్రవారం కొంతమంది విద్యార్థులు జేసీబీ బకెట్లో కూర్చొని ప్రమాదభరితంగా చేసిన ప్రయాణం చేయడం నమస్తేతెలంగాణ కంట పడింది. ఇదేమిటని విద్యార్థులను ప్రశ్నిస్తే..ప్రతి రోజూ పాఠశాలకు రావడం, పోవడం మొత్తం 10 కిలోమీటర్లు నడుస్తున్నామని, అందుకే ప్రతి రోజూ ఎవరైనా ఇలా వెళ్తుంటే వారి వాహనం ఎక్కి వెళ్తామని లేదంటే నడుచుకుంటూ వెళ్తామని సమాధానం చెప్పారు.