హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలి
ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
- హన్వాడ తాసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
హన్వాడ, మార్చి 12 : ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో దాదాపుగా 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టల్లో మౌలిక సదుపాయలు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి రూ.6లక్షలు మంజూరైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బాత్రూంలు లేకపోవడంతోపాటు ప్రహరీ లేక విషపురుగులు సంచరిస్తుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత రం తాసీల్దార్ కిష్టానాయక్కు వినతిపత్రం అందజే శారు. స్పందించిన తాసీల్దార్ డీడీ పాండుతో ఫోన్ లో మాట్లాడగా నిధులు మంజూరయ్యాయని, ని ర్మాణం చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, త్వరలో మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

