 
                                                            జడ్చర్లటౌన్, అక్టోబర్ 30 : విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను కళాశాల కమాన్‌కు ఉరితీసి ద హనం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ కళాశాలలు మూతబడటంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్, ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
                            