అమ్రాబాద్, మార్చి 28 : తండ్రి చనిపోయిన బాధను దిగమింగి పదో తరగతి విద్యార్థి పరీక్ష రాసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన హే మంత్నాయక్ తండ్రి ల క్యానాయక్ గురువారం రాత్రి చనిపోయాడు.
విద్యార్థి బంధువులు, ఉపాధ్యాయుల సూచన మేరకు శుక్రవారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షకు హాజరయ్యాడు. దుఃఖాన్ని దిగమింగుకొని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.