మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో గంజాయి బాచ్ (Ganja Batch ) రెచ్చిపోతుంది . ఇప్పటికే ఈ గంజాయి బ్యాచ్ పలు ప్రాంతాల్లో గొడవలు సృష్టిస్తుండగా తాజాగా ఓ విద్యార్థిపై అకారణంగా దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ పాలిటెక్నిక్ విద్యార్థి సాయిచరణ్ ( Saicharan ) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పాలిటెక్నిక్ కళాశాలలో ( Political College ) మూడో సంవత్సరం చదువుతున్న సాయి చరణ్ ఈనెల 16న తన స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా బండ్లగేరి ప్రాంతంలో ఆకతాయిలు సాయిచరణ్‌ను అడ్డగించారు. మొదట సిగరెట్ ఇవ్వాలని గొడవ దిగారు. తన దగ్గర లేదని సమాధానమివ్వడంతో, సిగరెట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు .
తన వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన గంజాయి బ్యాచ్ సాయిచరణ్ పై తీవ్రంగా దాడి చేశారు. శరీరంలోని ప్లీహం దెబ్బతినడంతో వైద్యులు దానిని తొలగించారు. నిందితులు గంజాయి సేవించి ఉన్నారని వెంటనే పట్టుకోవాలని సాయి చరణ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గంజాయి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.