వనపర్తి టౌన్, డిసెంబర్ 21 : పాఠశాల సమీపంలో ఉన్న పొలం బోరు వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన విద్యార్థి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్‌కు ప్రమాదవశాత్తు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది.
బాలుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు..
చిన్నంబావి మండలం పెద్దమారుర్ గ్రామానికి చెందిన శిరీష, భాస్కర్‌రావు దంపతులకు కుమారులు హరీశ్‌రావు, గౌతమ్ వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో పెద్దగూడెం శివారులో ఉన్న రేడియంట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. రోజు వారి మాదిరిగానే శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పాఠశాల సిబ్బంది నిద్రలేపారు.
ఆవరణలోనే స్నానాల కోసం వేడి నీటి ని అందించేందుకు ఏర్పాటు చేసిన స్థలం నుంచి సమీ పంలోని వేరుశనగ పొలం వద్దకు తోటి విద్యార్థి లోకేశ్‌తో కలిసి హరీశ్ వెళ్లాడు. పల్లీలు తెంచుకొని తిరిగి వస్తున్న క్రమంలో పంట రక్షణ కోసం కరెంట్ షాక్‌తో రైతు ఏర్పాటు చేసిన కంచెకు హరీశ్ తగిలి కిందపడిపోయాడు. భయం తో తోటి విద్యార్థి పాఠశాలకు వెళ్లి వాచ్మెన్, సిబ్బందికి విష యం చెప్పడంతో వారు హుటాహుటిన వచ్చి జి ల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందిస్తుండగా విద్యార్థి మృతి చెందా డు. ఈ విషయం తల్లిదండ్రు లు తెలియజేయగా వారు వచ్చి మార్చురీలోని కొడు కు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Mahabubnagar6
విద్యార్థి సంఘాల ఆందోళన
యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి చెందాడని ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఐద్వా మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యా న్ని అరెస్ట్ చేయాలని, పాఠశాల గుర్తింపును రద్దు చే యాలని డిమాండ్ చేశా రు. మృతి చెందిన వి ద్యార్థి కుటుంబాన్ని ఆ దుకోవాలని పెద్ద ఎ త్తున నినాదించారు. యాజమాన్యాన్ని అ రెస్టు చేసే వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. ఎంతసేపటికి యాజమాన్యం స్పందించకపోవడం తో ఆగ్రహంతో పాఠశాలలోకి ప్రవేశించి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్, సీఐ కృష్ణ, గోపాల్పేట్ ఎస్సై, ఎస్బీ ఎస్సై శివ చేరుకొన్నారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో వారు శాం తించి ఆందోళన విమరించారు. తర్వాత డీఈవో, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో విద్యా ర్థి సంఘాల నాయకులు తిరుమలేశ్, భరత్, ఆది, పవన్, రమేశ్, ఐద్వా సంఘం నేతలు పాల్గొన్నారు.