మాగనూరు కృష్ణ : సీల్ లేని విత్తనాలు , నకిలీ విత్తనాలు (Fake Seeds) విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్ గౌడ్(
AO Sudarsan Goud ) , ఎస్సై నవీద్ అన్నారు. బుధవారం కృష్ణా మండలంలోని ఎరువుల దుకాణాలు( Fertilizer Shops) , విత్తన దుకాణాలు ( Seed Shops) శ్రీరామ ట్రేడర్స్, అగ్రో రైతు సేవ కేంద్రం, వరలక్ష్మి ట్రేడర్స్ ను ఎస్సై, ఏవో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్టీ పత్తి విత్తనాలు, సీలు లేని విత్తనాలు, లైసెన్స్ లేకుండా రాత్రి పూట వచ్చి రైతులు విత్తనాలు అమ్మే వారి సమాచారాన్ని వ్యవసాయ శాఖ, పోలీసు శాఖకు అందించాలని కోరారు. సమచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. విత్తన సంచులపై విత్తనరకం, ల్యాబ్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేవో పరిశీలించిన తరువాత కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి బిల్లుపై సంతకం తీసుకోవాలని కోరారు.