Mahabubnagar | మహబూబ్‌నగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : ప్రధాన నగరాల్లో మాదిరిగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూ పొందిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంకు రాష్ట్ర ప్రభుత్వం ని ధులు మంజూరు చేసింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 6వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి వచ్చారు. ఈ క్ర మంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రతిపాదించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేస్తూ.. రూ.276 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మినీ ట్యాంకుబండ్ వద్ద మురుగునీరు వెళ్లేందుకు ఇప్పటికకే అండర్ గ్రౌండ్ డ్రైనేజీను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తరహాలో మహబూబ్‌నగర్ పట్టణంలోని అన్ని ము ఖ్యమైన కాలనీలు, మెయిన్‌రోడ్ల పక్కన సైడ్ డ్రైన్ల స్థానం లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థతో నాలాల్లో మురుగునీటి కష్టాలకు చెక్‌పడనున్నది.
ఇందుకు మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రెండు రోజుల కిందట కలెక్టరేట్లో అధికారుల తో సమీక్షించారు. ట్యాంక్‌బండ్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనే జీ నిర్మాణాన్ని పరిశీలించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవు తున్నది. హామీ ఇచ్చిన 18 రోజుల్లోనే మంత్రి కేటీఆర్ ట నిలబెట్టుకున్నారు. ఈనెల 6వ తేదీన ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో పా లమూరు అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు 23న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి రూ.276 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపు తున్నారు.
పాలమూరుకు నిధుల వెల్లువ..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.276 కోట్లు విడుదల చేసింది. ప్రధాన కాలనీలతోపాటు ఎక్కడెక్కడ మురుగు కాల్వలు ఓపెన్‌గా ఉన్నాయో.. వాటినన్నింటినీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలకు మళ్లిస్తారు. మురుగునీటిని శుద్ధి చే సేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు శుద్ధి కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఫిల్టర్ అయిన నీటిని మినీ ట్యాంక్‌బండ్‌లోకి మళ్లిస్తారు. మిగతా మురుగునీటిని పట్టణం వెలుపలికి పం పించే ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ఏడాది టైంబాండ్ పె ట్టుకొని పనులు కంప్లీట్ చేసేలా చూడాలని అధికారులకు సూచించా రు. కాగా, కొత్తగా ఏర్పడే కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రియల్టర్లు ప్రోత్సహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చాలా ప్రాం తాల్లో మురుగు నీరు సాఫీగా వెళ్లకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. వార్డుల పర్యటనకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మురుగు కాల్వల పరిస్థితిపై చలించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదించారు.
Mahabubnagar
ఏడాదిలోగా పూర్తిచేస్తాం..
మహబూబ్‌నగర్ పట్టణాన్ని హైదరాబా ద్ తరహాలో అభివృద్ధి చేయాలనే ధ్యేయం తో పనిచేస్తున్నాను. తెలంగాణ వచ్చాక సీ ఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సాధిం చాం. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీ ర్చిదిద్దుకుంటున్నాం. అడిగిన వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి సహకరించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయిస్తాం.
– డా.వి.శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి