జడ్చర్లటౌన్, డిసెంబర్ 8 : క్రీడాకారులందరూ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని మహబూబ్‌నగర్ డీఈవో ఏ రవీందర్ పిలుపునిచ్చారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 విభాగంలో 67వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా డీఈ వో రవీందర్ పాల్గొని రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్లో నైపుణ్యాన్ని చాటి విజయం సాధించాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 67వ రాష్ట్రస్థాయి బాల,బాలికల ఫుట్‌బాల్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి 10జిల్లాల నుంచి బాల, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొదటిరోజు జరిగిన లీగ్ మ్యాచ్‌లో బాలుర విభాగంలో ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు విజయం సాధించగా, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు విజయం సాధించాయి. బాలుర, బాలికల విభాగంలో ఆయా జిల్లాల పరిధిలో జరిగిన మ్యాచులు హోరాహోరీగా జరిగాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు పట్టణవాసులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో మంజులాదేవి, డీవైఎస్వో శ్రీనివాస్, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, ఉమాశంకర్‌గౌడ్, టీజీ పీఈటీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, జిల్లా అధ్యక్షుడు విలియం, వడెన్న, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్‌బాబు, జగన్మోహన్గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, బాలరాజయ్య, గజానంద్, శారదబాయి, జాన్సన్, కృష్ణయ్య, మోయిన్, మేర్సీ ప్రెంచ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, డిసెంబర్ 8 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఆర్ఎన్ఆర్ ధాన్యానికి అత్యధికంగా రూ.3,319 ధర పలికింది. బుధవారం మార్కెట్‌కు ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌కు 14, 822 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.3,319 ధర రాగా కనిష్ఠంగా రూ.1,759, మధ్యస్తంగా రూ.3,061 ధర పలికింది. అదేవిధంగా మార్కెట్‌కు 221 క్విం టాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,352, కనిష్ఠంగా రూ.1,909 పలికింది. అదేవిధంగా మార్కెట్‌కు 533 క్వింటాళ్ల హంస రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 2,069 ధర వచ్చింది. 28 క్విం టాళ్ల శ్రీరాంగోల్డ్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 3,069 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.