పనుల్లో వేగం పుంజుకోవాలి
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
- పెండింగ్ పనులను గుర్తించి వాటిపై దృష్టి సారించాలి
- ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకోవాలి
- అధికారుల సమీక్షలో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్‌లో మంత్రిని కలిసి ఆనందం వ్యక్తం చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
మహబూబ్‌నగర్, మే 24 : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులకు సంబంధించి పనుల వారీగా ఆయన అధికారులతో సమీక్షించారు. పనుల ఆలస్యంపై మంత్రి మండలాల వారీగా వివరాలు అడిగి తీసుకున్నారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి దశరథ్, ఎంపీడీవోలు ధనుంజయ, జ్యోతి, డీఈ విష్ణు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించినందుకు గానూ బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించి తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పినందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి తమవంతు పాటుపడతామని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

