అచ్చంపేటరూరల్, జూలై 29 : మధ్యాహ్న భోజనం గంటకుపైగా ఆలస్యం చేయడంతో విద్యార్థినులు ఆకలి అలమటించిన ఘటన మం గళవారం ఉప్పునుంతల మండలం వెల్టూరు మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్నది. ఉప్పునుంతల మండలానికి మంజూరైన బీసీ బాలికల గురుకుల పాఠశాలకు సరైన వసతులు లేకపోవడంతో అచ్చంపేటలోని జేఎంజే పాఠశాల సముదాయంలో కొనసాగిస్తున్నారు.
అయితే విద్యార్థినులకు రోజువారి మెనూ ప్రకారం మధ్యాహ్న భో జనం 1:15కు వడ్డించాల్సి ఉన్నది. కానీ మంగళవారం ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లేకపోవడంతో 2:30కు వడ్డించడంతో విద్యార్థులకు ఆకలితో అలమటించారు. ఈ విషయం విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో వారు మీడియాతోపాటు అచ్చంపేట ఆర్డీవో మాధవి దృష్టికి తీసుకుపోవడంతో ఆమె వెంటనే తాసీల్దార్ సైదులు కు విషయం చెప్పి పర్యవేక్షించాల ని ఆదేశించింది.
ఈ విషయం తెలుసుకు న్న మీడియా వారు గురుకులానికి వెళ్లగా వారిని లోపలికి అనుమతించకుండా గేటు బయటే ఉంచి అవమానించారు. గురుకులానికి చేరుకున్న తాసీల్దార్ సైదులు మ ధ్యాహ్న భోజనం ఆలస్యానికి గల కారణాలను తెలుసుకొని విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం భోజనాలు చేసిపెట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
అయితే వి ద్యార్థులకు కోసం వచ్చిన తల్లిదండ్రులు తాసీల్దార్‌తో మా ట్లాడుతూ తమ విద్యార్థులకు భోజనం వడ్డించకుండా ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ముందే తాము చూస్తుండగానే భోజనం ఎలా చేస్తారని ప్రశ్నించా రు. తమ పిల్లలకు సమయానికి మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు మెరుగైన విద్యను అందించాలని, ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థినులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ఆరోపించారు.
అయితే ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న ఉపాధ్యాయురాలు తన భర్త ప్రముఖ టీవీ రిపోర్టర్(నమస్తే తెలంగాణ కాదు) కావడంతో తన ను ఎవరూ ఏమీ చేయలేదరని గు రుకులం గేటు కూడా తాళం తీ యనివ్వకుండా మీడియా వారిని చివరకు అధికారులను లోనికి రాకుండా వాన్మెన్కు హెచ్చరికలు జారీ చేయడం గ మనార్హం చివరికి తాసీల్దార్ సైదులు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాకా గురుకు ల గేటు తాళం ఓ పెన్ అయిం ది.
ఓ దశలో ఇన్‌చార్జ్జిగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాలి భర్త మీడియాతో ఫోన్లో మాట్లాడుతు బెదిరింపులకు దిగారు. తనిఖీ అ నంతరం తాసీల్దార్ సైదులు మాట్లాడుతూ మధ్యాహ్న భో జనం గురుకులంలో గంట ఆలస్యమైన ట్లు తనిఖీలో వెల్లడైనదని మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే శాఖపరమైన చర్యలు తీ సుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.