మరికల్, మార్చి 14: మరికల్ మండలం పల్లె గడ్డ గ్రామానికి చెందిన సుమారు 100 మంది శ్రీవారి భక్తులు మన్నెంకొండలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవం కోసం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె గడ్డ గ్రామంలోని ప్రతి ఇంటి వాసులు ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారన్నారు. దీంతోపాటు ఆయా దేవాలయాల దర్శనాలకు ప్రతినెలా విడతల వారీగా గ్రామస్తులు వెళుతుంటారన్నారు.
అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ప్రతి ఏటా గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, భక్తులు తరలి వెళ్లడంతోపాటు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), శ్రీవారి సేవ సమితి ఆధ్వర్యంలో భక్తులు భారీగా ఈ కార్యక్రమానికి తరలి వెళుతున్నట్లు తెలిపారు