నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16 : స్వాతంత్య్రం వ చ్చినాటి నుంచి బీసీలు అణగదొక్కబడుతున్నారని, పొలిటికల్ పవర్ ద్వారానే హక్కులను సాధించుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు అధ్యక్షతన సగర శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ అత్యధిక ఓట్లున్న మనం ఓట్లు వేసి మన హక్కులను సాధించుకునేందుకు జొలేపట్టి అడుగుతున్నామని, బీసీల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ హయాంలో సగరులకు హైదరాబాద్‌లోని కోకాపేటలో 200 కోట్ల విలువచేసే 2ఎకరాల భూ మిని కేటాయించడం జరిగిందన్నారు. అందులో రూ.20కోట్లతో భవనం నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కుల గణన పే రు తో 42శాతంగా చూపించడం సరికాదని, 61శాతం గా రా ష్ట్రంలో బీసీలు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలపై కపట ప్రేమ చూపి అన్యాయం చేస్తే కన్నెర్ర చే యాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మ్ంర తి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సగరుల డి మాండ్లన్నింటినీ ఏకీభవిస్తున్నామన్నారు. ఎంపీ ఈ టెల రాజేందర్ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయం, సాధించుకోవాల్సిన హక్కులపై వివరించారు. సగర వెల్ఫేర్ సంస్థ చైర్మన్ మారుతిసాగర్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, నాగం శశిధర్‌రెడ్డి ఉన్నారు.