గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు పెద్ద ఎత్తున సమర్పించారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం జోరుగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌లోని క్లాక్ టవర్ వద్ద గాంధీ విగ్రహానికి గులాబీ పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మూతులకు నల్లగుడ్డలు ధరించి నిరసన తెలిపారు. అలాగే మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పలువురు నాయకులు కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసమర్థ, దద్దమ్మ, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు కండ్లు తెరిపించాలని వేడుకున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ముఖ్యమంత్రి నిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. గ్యారెంటీల కార్డుకు పాతరేసీ అటెన్షన్, డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదీస్తున్నాడని ఆగ్రహం చెందారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జనవరి 30
మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 30 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా మూతికి నల్ల గుడ్డలు కట్టుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి 420 రోజుల నుంచి ప్రజలను అయోమయానికి గురిచేస్తూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు.
రైతులు, సామన్య ప్రజలను ఎవరిని కదిలించిన ఆవేశంగా, ఆవేదనతో వాళ్లభాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నాయకులు తప్పా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేర ని, ఆ పార్టీలో చాలామంది నాయకులు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం పబ్బం గడుపుకునేందుకు నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకుంటు, విచారణ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో.. ప్రభుత్వంలో ఉన్నవాళ్లకూ స్పష్టత లేదని, ముఖ్యమంత్రి ఒక మాట.. మంత్రులు మరో మాట మాట్లాడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ప్రధానంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అధ్వర్యంలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరసలో నిలిపామని, పదేండ్లల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, రవీందర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నవకాంత్, పెద్దదర్పల్లి పార్టీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మావద్ద ఓట్లు దండుకొని రైతులను మోసం చేస్తుందని హన్వాడ మండలానికి చెందిన పాడి రైతు రవి తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డెయిరీకి ప్రతిరోజూ పాలు పోస్తున్నామని.. 15 రోజులకోసారి బిల్లు చెల్లించాల్సిన ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా పాల డబ్బులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీతో ఎరువులు, పశువుల దాణా ఇచ్చేవారన్నారు. ఆదివారం మీ ఖాతాలో రైతు భరోసా పడుతుందని సీఎం చెప్పినా నేటి వరకు ఒక్క రుపాయి కూడా పడలేదన్నారు.
– రవి, పాడి రైతు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు నెలల నుంచి తనకు పింఛన్ అందడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో అడక్కుండానే నెలకు రూ.రెండు వేల పింఛన్ వస్తుండే..
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తన పెన్షన్ అగిపోయిందంటూ అధికారుల వద్దకు వెళ్తే తమకు తెలియదంటు దాటవేస్తునారని, తన బాధలు చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెటింది.
– నీలమ్మ, గృహిణి
కేసీఆర్ దేవుడని ఆయన ఉన్నప్పుడు అడగక ముందే అన్ని పథకాలు అమలు చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో హన్వాడకు చెందిన ఓ వృద్ధుడు గురువారం మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా అన్నారు. కాంగ్రెసోళ్లు ఎన్నికల ముందు అన్ని పెంచి ఇస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం కనీసం వృద్ధులకు పింఛన్ కూడా పెంచడం లేదు. నెలనెలా సక్రమంగా పింఛనే ఇవ్వడం లేదు. సీఎం రేవంత్‌డ్డి అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను వంచించాడని మండిపడ్డారు.