మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 1 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యంకానీ హామీలను ప్రకటించి అధికారం చేపట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం అమెరికాలోని డాలస్‌లో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని చెప్పారు. ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న తెలుగువారంతా కలిసి ఉండటం సంతోషానిచ్చిందని మన సంప్రదాయాలను వచ్చే తరాలకు తేలియజేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కన్సెల్టెంట్ జనరల్ ఆఫ్ ఇండియా రమేశ్‌బాబు, పద్మశ్రీ అవార్డు గ్రహిత విఠలాచార్య, సెనెటర్ షాన్స్టిల్, జార్జియ ప్రతినిధి జోన్స్ కార్టర్, ప్రోటెమ్ మేయర్ దిలీప్ తుంకి, కౌన్సిల్ మెంబర్ బోబ్ ఎర్రమిల్లి, జాన్స్ క్రీక్ సిటీ, పోలీస్ చీప్మార్క్ మిచెల్ తదితరులు పాల్గొన్నారు.