వంగూరు, సెప్టెంబర్ 14 : స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెలంగాణ బీసీ మహాసభ, బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ హక్కుల శంఖారావం సదస్సును నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మన తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, కేటీఆర్ సేవా సమితీ జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, బీసీ నేతలు పాల్గొన్నారు.