మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 17 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి రాజ్యాంగ బద్ధంగా చట్ట సవరణ చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నా రు. జీవో ప్రకారం రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ చెప్పినా వినలేదని, మా పార్టీ చెప్పిందే నేడు నిజమైందని గుర్తు చేశారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఉంటే రాజకీయ ప రంగా సమానత్వం వస్తుందని, రాజ్యాంగంలో రాజకీయంగా ఉన్నామనే భావన ప్రజల్లో ఉంటుందన్నారు.
అందుకే రాజకీయాలతోపాటు విద్యా, ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ నుంచి సంపూర్ణ మ ద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బంద్‌కు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని ముఖ్యంగా ఆర్టీసీ సంస్థ వారు బస్సులను బయటికి తీయవద్దని, విద్యా, వ్యాపార సంస్థలు కూడా బంద్‌కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జెడ్పీటీసీ నరేందర్, గణేశ్, ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, నరేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.