మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 21 : మహబూబ్‌నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘునందన్‌రావుకు ఫోన్ చేసి గోపాల్‌ను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా దు బాయి ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు ఇఫ్తేకర్ అహ్మద్‌తో మాజీ మంత్రి మాట్లాడుతూ గోపాల్‌ను తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం ఇవ్వాలని కోర గా.. అతని సమస్య తెలుకొని పరిష్కరిస్తామని, ఆర్థికంగా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని ఇఫ్తేకర్ మాజీ మంత్రికి హామీ ఇచ్చారు.