నాగర్కర్నూల్టౌన్, జూన్ 8 : నాగర్కర్నూల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న గ్రూప్-1 పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రం లో ఉన్న 18 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్ష న్ అమలులో ఉంటుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ కేంద్రంలో 14, పాలెంలో 2, తెలకపల్లిలో 2 సెంటర్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్స్, ఇతర షాపులను మూయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఐదుగురు పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భ ద్రత ఏర్పాటు చేస్తామన్నారు. బయోమెట్రి క్ ఉంటుందని, కావున పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యం అయినా లోనికి పంపడానికి వీలు లేదని, హాల్ టికెట్, ఐడీ కార్డు అన్ని జాగ్రత్తగా చూసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలన్నా రు. మీ యొక్క పరీక్ష కేంద్రాలకు సంబంధించిన అడ్రస్ తెలియకుంటే బస్టాండ్ వద్ద యూనిఫాంలో మూడు టీంలుగా ఆరు మంది పోలీస్ సిబ్బంది ఉంటారని, వారిని పరీక్ష కేంద్రాల అడ్రస్ అడిగి తెలుసుకొని మీ పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు.