నవాబ్‌పేట, మే 31 : ఆస్తి కోసం కన్నతండ్రిని విచక్షణా రహితంగా చితకబాదిన ఘట న మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మం డలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. కొడుకు దాష్టికాన్ని తట్టుకోలేక తనకు రక్షణ కల్పించండంటూ తండ్రి పోకల కృష్ణ య్య శనివారం పోలీసులను ఆశ్రయించాడు. ఏఎస్సై జనార్దన్ కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన పోకల కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కృష్ణయ్య పెద్ద కుమారుడు పోకల లక్ష్మణ్‌కుమార్, చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు పెండ్లిళ్లు చేశాక తం డ్రి కృష్ణయ్య ఆస్తిలో సమానంగా ఇద్దరికి భాగాలు పంపిణీ చేసినట్లు వివరించారు.
కాగా కృష్ణయ్య పేరుపైన కొంత ఆస్తి ఉండగా అది కూడా తనకే కావాలని లక్ష్మణ్‌కుమార్ కొంతకాలంగా తండ్రిని తరచూ వేధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని శనివారం తండ్రి కృష్ణయ్య ఇంట్లో ఉన్న సమయంలో లక్ష్మణ్‌కుమార్ అతడి స్నేహితులు కొండాపూర్‌లోని ఇంటికి వచ్చి విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు. మిగిలిన ఆస్తి మొత్తం తనకే రాసివ్వాలని లేకపోతే చంపేస్తానంటూ..బెదిరించినట్లు ఏఎస్సై జనార్దన్ తెలిపారు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై జనార్దన్ పేర్కొన్నారు.