మహబూబ్నగర్ అర్బన్, మార్చి 5 : మహబూబ్నగర్ జిల్లాలో కంటివెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. నిరంతరాయంగా శిబిరాలు నిర్వహిస్తుండడం తో ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 441 గ్రామ పంచాయతీలకుగానూ 135 జీపీల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. మరో 33 పంచాయతీల్లో పురోగతిలో ఉన్నవి. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు.. 86 వార్డులు ఉండగా.. 34 వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. మరో 12 వార్డుల్లో కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,90, 025 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఇందులో 89,756 మంది పురుషులు, లక్షా 433 మంది మహిళలు ఉన్నారు. 8 మంది ట్రాన్స్జెండర్లు పరీక్షలు చేయించుకున్న వారిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 29,017 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. ఇందులో 4,096 మంది 40 ఏండ్లకంటే తక్కువ వయస్సు వారు ఉండగా.. 24,908 మంది 47 ఏండ్లకుపైబడిన వారు ఉన్నారు. 19,351 మందికి అద్దాలు అవసరం ఉన్నాయని ఆర్డర్ ఇచ్చారు. వీటిలో ఇప్పటికే 3,643 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణి చేశారు. ఇంకా 15,708 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇవ్వాల్సి ఉ న్నది. 1,41,856 మందికి ఎలాంటి కంటి జబ్బులు లేవని గుర్తించారు. సుమారు 75 శాతానికిపైగానే ప్ర జలు శిబిరాలకు వస్తున్నారు. కంటి అద్దాలు అందుకొ ని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ప్రజలు చెబుతున్నారు.
చాలా బాగుంది..
మా ఊళ్లో కంటివెలుగు వైద్య శిబిరం నిర్వహిస్తున్న ట్లు కావలికారు చాటింపు వేశారు. పరీక్షల కోసం శిబిరానికి వెళ్లాను. అక్కడున్న డాక్టర్లు కండ్లను పరీక్షించి రీడింగ్ అద్దాలను ఇచ్చారు. అంతకుముందు మసకబారినట్లు ఉన్న కండ్లు అద్దాలు పెట్టుకున్న తర్వాత బాగా కనిపిస్తున్నాయి. కంటివెలుగు కార్యక్రమం చాలా బాగుంది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– సత్యమ్మ, అన్నాసాగర్, భూత్పూరు
శిబిరాల వద్ద టెంట్లు ఏర్పాటు..
18 ఏండ్లు పైబడిన వారందరినీ కంటి వెలుగు శిబిరానికి వచ్చేలా అవగాహన కల్పించాలని వైద్య బృందాలను ఆదేశించాం. వేసవిని దృష్టిలో పెట్టుకొని శిబిరాల వద్ద తాగునీరు, టెంట్లతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేత్ర వైద్య సిబ్బంది గ్రామాలకు వచ్చి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అద్దాలు అందిస్తున్నారు. ఉచితంగా చేస్తున్న పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– జీ.రవి నాయక్, కలెక్టర్, మహబూబ్నగర్