వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డుకు చెందిన 50మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని రాబోవు కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు.
తమ హయాంలో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపించామని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేశామని నేడు రోడ్లు ఆక్రమించుకుంటున్న పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని అన్నారు. రాబోయే మన ప్రభుత్వంలో జాగలేని, ఇల్లులేని పేదవారు ఉండకుండా కృషి చేస్తామన్నారు. యు వతకు స్వయం ఉపాధి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెం చి కేసీఆర్ సామాన్యులను హీరోలను చేస్తే రేవంత్‌రెడ్డి విధ్వంస పాలనలో సామాన్యులు జీరోగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లలో జరిగిన అభివృద్ధే తప్పా గత రెండేండ్లలో చే సింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీ నా యకులు గట్టుయాదవ్, శ్రీధర్, రమేశ్‌గౌడ్, అశోక్ పాల్గొన్నారు.