ఖిల్లాఘణపురం/ పెద్దమందడి, ఏప్రిల్ 11 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పూలే జయంతి సందర్భంగా ఆయన జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బం గా ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి రోజూ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలను తరలించే విధంగా నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రా నాయకుల బానిసత్వం నుంచి తెలంగాణను విముక్తి చేసి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని, నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు, సాగునీరు, సమగ్ర అభివృద్ధి ఎంతో కృషి చేశామన్నారు. ప్రజల కష్ట సుఖాల వెంట ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. గణప సముద్రంలో ఏడా ది పొడవునా నీళ్లు ఉండేవిధంగా కేఎల్ఐ ప్రధాన కాల్వ నుంచి నీళ్లు మళ్లించి సస్యశ్యామలం చేశామన్నారు. 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశామన్నారు. దీంతో పాటు వట్టెం రిజర్వాయర్ నుంచి కూడా సాగునీరు అందించేందుకు గొప్ప ప్రణాళికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు.
గణప సముద్రం రైతులకు ఎలాంటి కష్టం కలుగకుండా ముగ్గురు చీఫ్ ఇంజినీర్లతో కమి టీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ద్వారానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నోమార్లు మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి రూ.50కోట్లు మంజూరు చేయించానని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఆయన గుర్తుచేశారు. అలాగే పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.
పల్లె పల్లె నుంచి పండుగ వాతావరణంలో రజతోత్సవ సభకు తరలిరావాలని పిలుపుని చ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను , కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి, దయాకర్, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుమార్‌యాదవ్, విజయ్‌కుమార్, నందిమళ్ల ఆశోక్, కృష్ణనాయక్, రాళ్లకృష్ణయ్య, సామ్యనాయక్, జాత్రునాయక్, బాలీశ్వర్‌రెడ్డి, పురేందర్‌రెడ్డి, వెంకటరమణ, రంగారెడ్డి, ఆంజనేయులుగౌడ్, నాగేంద్రం, సేనాపతి, కురుమూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు.