గద్వాల, ఏప్రిల్ 9 : రాష్ట్రం లో కాంగ్రెస్-బీజేపీ ఒకే గొడుకు కింద పని చేసే పార్టీలని వారి టార్గె ట్ అంతా తె లంగాణ తొలిముఖ్యమ ంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు అధ్యక్షతన ఈ నెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభను పురస్కరించుకొని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరై కార్యకర్తలకు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మా ట్లాడుతూ మోదీ-సోనియా కట్టిన ఇంట్లో కాపురం చేస్తుండగా కేసీఆర్ ఇళ్లు కట్టి కాపురం చేస్తున్నాడని చెప్పారు.
రేపటి తరానికి జరిగే మేలు గురించి ఈ సభలో కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఇత ర పార్టీలతో మనకు సంబంధం లేదని ప్రతిపక్షాలు సిగ్గుపడేలా తెలంగాణను అభివృద్ధి చేసి చూయించిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఉమ్మివేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం ఖాయమని ప్రస్తుతం ఉప ఎన్నికలు వస్తే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితిలో లేరన్నారు. రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిట్టకపోతే ఆయనకు నిద్రరాదన్నారు. రాష్ట్రంలో తెలంగాణకు బలం లేకపోతే కేంద్రమంత్రి తన ప్రతి సమావేశంలో కేసీఆర్‌పై ఎందుకు మాట్లాడుతాడని ప్రశ్నించారు.
ప్రజలకు అబద్ధాల హామీలు ఎర వేసి ఓట్లు వేయించుకున్నారని, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమే అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజలు పార్టీపై ఆక్రోశంతో ఉన్నా రన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహి స్తే ఆ పార్టీకి పరాభవం తప్పదని భా వించి ముఖ్యమంత్రి వాటిని వా యిదా వేస్తూ వస్తున్నాడని ఎన్ని వాయిదాలు వేసిన మే లేదా జూ న్, జూలై, ఆగస్టు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పో తే కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే నిధులు నిలిచి పోతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వ చ్చిన గద్వాల కోటపై గులాబీ జెండా ఎగుర వేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. 27న నిర్వహించే సభలో కేసీఆర్ మాటలు విని ప్రతిపక్ష నాయకుల గుండెలు పగిలి పో తాయన్నారు.
ఇక్కడ పార్టీ గుర్తుమీద గెలిచిన వాడు పార్టీకి ద్రోహం చేశాడని, ద్రోహం చేసిన వ్యక్తులకు ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. భారత చిత్రపటంలో తెలంగాణను నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎవడో బోడి గాడు పార్టీని వదిలి వెళితే మనకు వచ్చిన నష్టం లేదన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అన్నారు. ప్రతి సమావేశంలో పార్టీకి ద్రోహాం చేసిన ఎమ్మెల్యే పేరును ఉచ్చరిస్తే మిమ్మల్ని మీరే చిన్నబుచ్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేస్తే ఇట్ల మోసం జేస్తదని అనుకోలేదని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తెలంగాణ సమాజం ఎప్పుడు కాంగ్రెస్‌ను నమ్మవద్దని సూచించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబును కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఒడించిన చతురత కలిగిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడితె చ్చి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. మోసానికి ఆదిగురువు కాంగ్రెస్ అని మాజీ మంత్రి ఆరోపించారు. 1400మంది ప్రాణాలు బలితీసుకున్న తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసిందని దీనిని తెలంగాణ సమాజం సహించలేక పోతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏనాడు ఇక్కడి నాయకులు పార్టీ కోసం పని చేయని వారు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ప్రతి పక్ష హోదాలో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ చీల్చి చెండాతుందని చెప్పారు. రజతోత్సవ సభకు అన్ని గ్రామాలు, మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని,అందుకోసం నాయకులు,కార్యకర్తలు గ్రామాలు,మండలాల్లో స మావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను సమీకరించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.
అనంతరం బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు మా ట్లాడుతూ కార్యకర్తలకు అండగా నేనుంటానని కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. పార్టీకి కార్యకర్తలే పట్టు గొమ్మలని వారిని కాపాడుకునే బాధ్యత నాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ గద్వాల ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పార్టీ మారాడని చెబుతున్నాడని పార్టీ మారిన తర్వాత ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి నేత పదవులు అనుభవించి పార్టీలు మారుతున్నాడని ఆరోపించారు. ఆ యన తీరు చూస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందన్నారు. కేసీఆర్ అడగకుండానే ప్రజలకు వరాలు ఇచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్ వరాలు ఇచ్చి అమ లు చేయడం లేదన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శ్యామల, నేతలు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వి ష్ణువర్ధన్రెడ్డి, కుర్వ పల్లయ్య, మనోరమ, అతికూర్ రహేమాన్, మోనేశ్, బీచుపల్లి, చక్రధర్‌రావు, రాజు మాట్లాడారు. కార్యక్రమంలో రాము, మాజ్, శేఖర్‌నాయుడు, శ్రీరాములు, తిరుమలేశ్ పాల్గొన్నారు.