వనపర్తి టౌన్, జూలై 21 : వనపర్తి మండలంలోని అంజనగిరి గ్రామంలో చేపడుతున్న సర్ ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమకు ఇచ్చిన ఫారాల్లో వివరాలు నమోదు చేసి బీఎల్వోలకు సకాలంలో అందజేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఏల్‌ఏలు ప్రతి ఓటరుకు సమాచారం అందజేసి నమోదు చేసుకునేలా అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులంతా ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉండాలని, శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో మేధా సంపత్తి పెరుగుతుందన్నారు. శాఖాహరంలో మాంసకృతులకు మించి ప్రోటీన్స్ ఉంటాయని అన్నారు. అదే విధంగా బోర్డు మీద వనపర్తి నియోజకవర్గంలోని గ్రామాలు, రాష్ర్టా ల పేర్లు రాసి విద్యార్థులతో చదివించారు. మాజీ మంత్రివెంట మాణి క్యం , రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, నాగవరం నరేశ్, డేగ మహేశ్వర్‌రెడ్డి, చి ట్యాల రాము, నం దిమల్ల అశోక్ ఉ న్నారు.