వనపర్తి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలను కించపరు స్తూ రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష సీఎం పదవికే క ళంకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. నీకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉండి మంత్రులుగా పనిచేసిన మహిళా నాయకులను ఉన్మాద భాషతో రేవంత్‌రెడ్డి అవమానించడం అత్యంత దారుణమన్నా రు. బుధవారం వనపర్తిలోని తన నివాసంలో నిరంజన్‌రెడ్డి అ సెంబ్లీలో సీఎం మాట్లాడిన తీరుపై విలేకరులతో మాట్లాడారు.
సీఎం సీటు ఎక్కిన తొలిరోజు నుంచి అడ్డమైన భాషను వాడుతున్నాడని, గ తంలో ఏ ముఖ్యమంత్రులు ఇలాంటి భాషను ఉపయోగించలేదని, ని జాలు మాట్లాడితే తట్టుకోలేక, అధికారం ఉందని కసితో వ్యవహరించ డం సరైంది కాదన్నారు. మాట్లాడిన తీరుకు భేషజాలకు పోకుండా క్షమాపణలు చెప్పాలని, నీకు వచ్చిన సీఎం పదవిని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికైనా కనువిప్పు కలగకపోతే చరిత్ర క్షమించదన్నారు. కాంగ్రెస్ అంటే.. రేవంత్ అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, బీఆర్ఎస్లో రాజకీయం మొదలెట్టిన నీవు ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆరు గ్యారెంటీలకు పాతరేసి.. అద్భుతమైన పాలన అంటూ కి తాబిస్తున్నారని విమర్శించారు.
పాలన అంతా బాగా ఉంటే, రైతులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, ఆటో కార్మికులు ఎందుకు రోడ్లెక్కుతారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎనిమిది నెలల కాంగ్రెస్ దుర్భరమైన పాలనకు నిలిచిపోయిన సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు. రైతుబంధుపై దోబూచులాడుతున్నారని, గుట్టలు.. గట్ల పేరుతో కమిటీలు వేసి కాలయాపనతో రైతులకు తీరని వ్యధను మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వానకాలం సేద్యం మొదలైనప్పటికీ రైతుబంధు ఊసెత్తడం లేదని, ఎలాగైనా ఈ సీజన్లో ఎగ్గొట్టాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ అని విమర్శించారు. రుణమాఫీ అంటూ కేవలం గొప్పలు చెబుతున్నారని గ్రామాల్లో రైతుల దగ్గరకు వెళితే అసలు విషయం వారికి అర్థమవుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రేవంత్‌రెడ్డి ఎంతోకాలం సీఎం పదవిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న భయంకరమైన విషయాలపై కాంగ్రెస్ అధిష్టానమే భీతిల్లుతున్నట్లు కొన్ని వార్తల ద్వారా వింటున్నామన్నారు. తెలంగాణలో కూడా అలాంటి వాతావరణమే ఉందని, కాంగ్రెస్ అధిష్టానం సైతం విస్తుపోవడం ఖాయమన్నారు. క్షమాపణలు చెప్పకుంటే అహంకార మాటలే పతనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గ్రం థాలయాల సంస్థ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, మాణి క్యం, విజయ్‌కుమార్, అశో క్, రవి, నాగన్నయాదవ్, తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గిరి, జోహెబ్, రాము, శ్రీ నివాసులు ఉన్నారు.