వనపర్తి టౌన్, నవంబర్ 2 : జూబ్లీహిల్స్‌లో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కాం గ్రెస్‌కు చెంపపెట్టులా ఉండాలని.. ఆరు గ్యారెంటీలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కారు నిండా ముంచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సోమాజిగూడ, విజయ టవర్స్‌లో ఆత్మీయ సమ్మేళనం, ప్రచారం నిర్వహిం చా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మహిళలకు అవకాశం వస్తే అద్భు తాలు సృష్టిస్తారని చరిత్ర చెబుతున్నదని, అటువంటి మహిళలను కిం చపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సునితను ఉద్దే శించి మాట్లాడడం బాధాకరమన్నారు.
ఒక గృహిణిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి అనుకోని పరిస్థితుల్లో రా జకీయాలకు వచ్చి తన ప్రతిభతో పాలన సాగించి చూ పించారని కొనియాడారు. సోనియాగాంధీ, ప్రియాం కగాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మా గంటి సునీత పాలనకు ఎందుకు అర్హులు కారో ప్రజ లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నిక ల్లో గెలుపోటములు సహ జమని.. చేసిన, చేయబో యే అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు అడగాలి కానీ కేసీఆర్, కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ పబ్బం గడుపు కోవడం వల్ల పేదల కడుపులు నిండవని హితవు పలికా రు.
అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కూడా అనివార్యంగా రాజకీయా ల్లోకి వస్తే గృహిణి ఏం చేస్తుందని కించపరిచారని, మహిళగా ఒంటరిగా పోరాడి ధీటుగా సమాధానం చె ప్పామని.. మాగంటి సునీతను గెలిపిస్తే మాగంటి గో పీనాథ్ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తుందన్నారు. ఆమెకు మేము, పార్టీ అండగా ఉంటామని చెప్పారు. అనంత రం మాజీ మంత్రుల సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, విజయ టవర్స్ అధ్యక్ష, కార్య దర్శులతోపాటు నాయకులు ఉన్నారు.
భూత్పూర్, నవంబర్ 2 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునిత గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్ డివిజన్లోని నీలకంఠేశ్వర కాలనీలో విస్తృతంగా ఇం టింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, జెడ్పీటీసీ లు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మాజీ ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయ ణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలచందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, నవంబర్ 2 : బీఆర్ఎస్ హయాం లోనే సంక్షేమ పాలన అందిందని పేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 102లో వినాయకనగర్, ఎస్పీఆర్ హిల్స్‌లో ధన్వాడ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఓటర్లకు నమూనా బ్యాలెట్ చూపిస్తూ సీరియల్ నెంబర్ 3లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని కోరారు.