బిజినేపల్లి,మార్చ్ 7: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాల అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. సోమవారం బిజినపల్లి మండల కేంద్రంలోనీ బస్టాండ్ ఆవరణలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కార్మికులకు చట్టాలు పకడ్బందీగ ఇంతవరకు అమలు కావడం లేదని విమర్శించారు.
కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న నాగర్ కర్నూల్ జిల్లా 2వ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా భవన నిర్మాణ జిల్లా కన్వీనర్ చిన్నపాగ శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు, గొర్ల సత్యం, బిజినపల్లి మండల భవన నిర్మాణ నాయకులు టిశ్యామ్, బి.శివ, సుదర్శన్, డిహనుమంతు, శ్రీను, తదితర మేస్త్రీలు పాల్గొన్నారు.