అచ్చంపేటరూరల్, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ఘణపూర్ గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో పంటకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలో పడి గొర్రెల కా పరి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘణపూర్ శివారులో అడవిపందుల బెడద కోసం వేరుశనగ పంటకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెలో ప్రమాదవశాత్తు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చాకెల్లి గ్రామానికి చెందిన నేతన వెంకటయ్య అనే గొర్రెల కాపరి పడి మృతిచెందాడు.
వెంకటయ్య కొన్నినెలలుగా నల్లమల అడవిలో గొర్రెల మేత కోసం గ్రామ శివారులో మందను ఏర్పాటు చేసుకొని వా టిని సంరక్షిస్తు జీవనం సాగిస్తున్నాడు. గ్రామ శివారులో గొర్రెలు తప్పిపోగా వాటి కోసం వెళ్లిన వెంకటయ్య పం టకు ఏర్పాటు చేసిన కంచెను గమనించక అందులో పడి మృత్యువాత పడ్డారని తెలిపారు. మృతుడి భార్య యాద మ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.