కొల్లాపూర్, జూలై 17: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టాన్ని శుక్రవారం అధికారులు పూర్తి చేశారు. కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐలో రెండో పంప్‌ను టెస్ట్న్ చేసి సాంకేతిక అడ్డంకులను అధిగమించారు. దాదాపు ఐదు నుంచి పది నిమిషాలపాటు ఫుల్ స్పీడ్‌తో డ్రైరన్ చేసి వెట్న్‌క్రు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నా రు. 145 మెగావాట్స్ ఉన్న బాహుబలి మోటర్ డ్రైరన్ విజయవంతం కావడంతో అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెం టనే వెట్న్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లను పీఆర్ఎల్ఐలో ఏర్పాటు చేయడమంటే కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2023 సెప్టెంబర్ 16న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 145 మెగావాట్స్ బాహుబలి మోటర్‌ను ప్రారంభించి.. 2 టీఎంసీలు కృష్ణా జలాలను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దాదా పు 34 నెలల తర్వాత అదే మోటర్‌ను 2026 జూలై 14న గంట వ్యవధిలోనే 0.01 టీఎంసీలను మళ్లా నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి అధికారులు ఎత్తిపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భారీ మోటర్లను డ్రైరన్ చేయకున్నా, ఏండ్ల తరబడి నిరుపయోగంగా పెట్టినా.. తప్పని పరిస్థితిలో మళ్లీ ఆన్ చేసినా.. ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా విజయవంతంగా పనిచేశాయి. బాహుబలి మోటర్ సామర్థ్యంతోపాటు, కేసీఆర్ పాలమూరుపై చూపిన ముందు చూపునకు ఈ మోటర్ సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే రెండో పంప్‌లోని బాహుబలి మోటర్ కూడా 34 నెలల తర్వాత సక్సెస్‌ఫుల్‌గా డ్రైరన్‌ను పూర్తి చేసుకున్నది.
కరువు రక్కసిని ప్రత్యక్షంగా అనుభవించిన ఉమ్మడి జిల్లాను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పాలమూరు ప్రాజెక్టు నాణ్యత విషయంలో నాటి బీఆర్ఎస్ ప్రభు త్వం రాజీ పడలేదు. ఫలితంగానే నేడు రేగుమాన్గడ్డ వద్ద మొదటి స్టేజీలోని రెండో బాహుబలి మోటర్ శుక్రవారం టెస్ట్ రన్ పూర్తి చేశారు. ఇతర దేశాల నుంచి మో టర్లను దిగుమతి చేసుకుని ఏర్పాటు చేయొచ్చు కానీ, నాటి కేసీఆర్ సర్కార్ మాత్రం దేశీయంగానే ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకొని బాహుబలి మోటర్లను తయారు చేయించింది. దీంతో అత్యంత నమ్మకమైన.. నాణ్యమైన బాహుబలి మోటర్ దాదాపు మూడేండ్ల తర్వాత కూడా సత్తా చాటాయి. చాలా వరకు భారీ యంత్రాలను నిరుపయోగంగా పెడి తే దెబ్బతింటాయని నిపుణులు సూచిస్తుంటారు.
భారీ సామర్థ్యం, అత్యధిక మెగావాట్స్ కలిగిన మోటర్లను డ్రైరన్ చేయకుండా ఎక్కువ కాలం ఉంచితే బేరింగ్లు తుప్పు పట్టే అవకాశం ఉంటుందన్నది వాదన.. కనీసం 60 రోజులకోసారి అయినా మోటర్ షాప్ట్‌ను కొద్దిగా తిప్పడం, వైండింగ్ హీటర్లను ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచడం, డ్రైరన్ లేదా రొటేషన్ లేకుండా హీటర్ల రక్షణ లేకుంటే మోటర్లు దెబ్బతింటాయని విశ్రాంత సీనియర్ ఇరిగేషన్ అధికారులు పేర్కొంటుంటారు. రేవంత్ ప్ర భుత్వం వచ్చాక బాహుబలి మోటర్ల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, డ్రైరన్‌లు చేపట్టలేదని చాలా వరకు విమర్శలు ఉండేవి. ఎట్టకేలకు మొదటి స్టేజీలోని రెండో మోటర్‌ను డ్రైరన్ చేయడంతో చాలాకాలం తర్వాత కూడా ఈ మోటర్ల సామర్థ్యం, ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకం పెరిగింది. దీనికి తోడు కేసీఆర్‌కు పాలమూరుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజలు పేర్కొంటున్నారు.
అనతి కాలంలోనే పనులను 90 శాతం పూర్తి చేయడంతోపాటు, రెండు టీఎంసీలను ఎత్తిపోసి చర్రిత సృష్టించిన పీఆర్ఎల్ఐపై నేడు అందరి చూపు ఉన్నది. ఇదే పాలమూరు బిడ్డ రేవంత్ సీఎం అయ్యాక పనులు పెండింగ్‌లో ఉంచారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్రకు సిద్ధం కావడంతో ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. 15 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉన్న పెండింగ్ పనులను ఇప్పటి వరకు 5 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ సందర్శన తర్వాత కూడా పనులు మందకొడిగానే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి ఒత్తిడిని తగ్గించుకునేందుకు కేసీఆర్ ఆన్ చేసిన మోటర్‌ను మళ్లీ ఆన్ చేయడంతో బాహుబలి మోటర్ గంట సమయంలోనే కృష్ణానది నీళ్లను రికార్డు స్థాయిలో డ్రా చేసింది. దీంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలు రోజుకు 3,200 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోసే బాహుబలి మోటర్ల గురించి ఆరా తీసే పరిస్థితి వచ్చిందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. రెండో మోటర్ కూడా డ్రైరన్ పూర్తి కావడంతో రెండు బాహుబలి మోటర్ల వెట్ రన్ చూసేందుకు రైతులతో పాటు, సాగునీటి నిపుణులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు.