గద్వాల, ఏప్రిల్ 17 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో ఉక్కపోత, వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుం చి సాయంత్రం 5 గంటల వరకు ఇండ్ల ను ంచి బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే వస్తున్నారు. 11 గ ంటలలోపే పనులన్నీ ముగించుకొని ఇండ్లకే పరిమితమతున్నారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిగాయి.
మధ్యాహ్న సమయంలో రోడ్ల న్నీ నిర్మానుశ్యంగా మానుతున్నాయి. వడగాలుల వల్ల ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. వడదెబ్బకు అయిజ మండలం తూం కుంట గ్రామానికి చెందిన మల్లికార్జున్ మృ తి చెందాడు. దీంతో ఎండలకు ప్రజలు మరింత భయపడుతున్నా రు. జిల్లాలో జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు గ్రా మాల్లో రహదారులన్నీ జనం లేక బోసిపోతున్నాయి. ఎండ నుంచి రక్షణగా గొడుగులు ఉపయోగిస్తుండగా.. మహిళలు స్కా ర్ప్లు, పురుషులు టవాల్స్, కర్చీ ఫ్, టోపీలు వాడుతున్నారు. మరికొందరు మహిళలు తమ చీర కొంగులను తలకు చుట్టుకొని ఉపశమనం పొందుతున్నారు. వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు.
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాలతోపాటు కొబ్బరి బోండాలు, జూస్లు, చెరుకు రసాలు తాగుతున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఏసీలతోపాటు కూలర్ల వద్దే ఉంటూ సేద తీరుతున్నారు. ఎండల తీవ్రతతో మార్కెట్లో ఏసీ, కూలర్లకు గిరాకీ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉపశమనం కోసం కాటన్ దుస్తులే ధరించాలని, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తరచూ నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో తాటిముంజలకు భలే డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా విక్రయాలు చేపట్టడంతో ప్రజలు కొనుగోలు చేసి ఉపశమనం పొందుతున్నారు.