అలంపూర్, జనవరి 10 : మండలంలోని సింగవరం-2లో రూ.10లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను బుధవారం ఎమ్మెల్యే విజయుడు, ఎమెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సర్పంచ్ అనితాసాయిబాబాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యాభ్యాసం ఎలా ఉం ది..? వసతులు ఎలా ఉన్నాయి..? భోజనం మె నూ ప్రకారం వడ్డిస్తున్నారా? తదితర విషయాలను తెలుసుకున్నారు. ఎంఈవో అశోక్‌కుమార్, సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్తుల కోరికమేరకు పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అనంతరం రైతులు ఎమ్మెల్యే విజయుడితో సమస్యలను విన్నవించారు. అలాగే మండలంలోని బుక్కాపురం క్లస్టర్లో రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను సర్పంచులు, ఎంపీటీసీతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతకుముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రైతువేదిక ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పా టించలేదని, వ్యవసాయధికారులను ఎందుకు పి లవలేదనే విషయంలో గ్రామానికి చెందిన కాం గ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మ ధ్య వాగ్వాదంతో కూడిన తోపులాట చోటుచేసుకున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకే ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టామని, వ్యవసాయాధికారులకు కూ డా సమాచారం ఇచ్చామని బీఆర్ఎస్ నాయకులు విలేకరులకు వివరించారు. సంబంధిత అధికారులకు లేనిబాధ కాంగ్రెస్ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమానికి అడ్డుతగిలినవారు ప్ర జాప్రతినిధులు కారు, అధికారులు అంతకన్నాకా దు ఎందుకు కార్యక్రమాన్ని డిస్ట్రర్బ్ చేస్తున్నారని నిలదీశారు. దీంతో రైతువేదిక ప్రారంభోత్సవం అనంతరం సభ నిర్వహించకుండానే బీఆర్ఎస్ నాయకులు వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇరువర్గాల వారు అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
అయిజ, జనవరి 10 : పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గజ్జి ఉత్తనూరమ్మ (77) అనారోగ్యం తో బుధవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆమె పాడె మోశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.