వనపర్తి టౌన్/నారాయణపేట రూరల్/గద్వాలటౌన్/పాలమూరు, జూన్ 11 : నేటి నుంచి బడిగంట మోగనున్నది. ఈనెల 6 నుంచి బడిబాట ప్రారంభమవగా.. హెచ్ఎంలు, టీచర్లు ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా 697 పాఠశాలలు ఉండగా.. అందులో 527 ప్రభుత్వ పాఠశాలలు (359 ప్రైమరీ, 61 అప్పర్ ప్రైమరీ, 101 హైస్కూళ్లు) కేజీబీవీలు 15, గురుకులాలు 18, మోడల్ స్కూల్స్ 3 ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ సెక్టార్ పరిధిలో 6 హైస్కూ ళ్లు, ఒక యూపీఎస్, 15 ప్రాథమిక పాఠశాలలు.. జెడ్పీ పరిధిలో 319 ప్రాథమిక పాఠశాలలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 జెడ్పీ హైస్కూళ్లు.. 11 కేజీబీవీలు, 2 మోడల్ స్కూల్స్, 13 గురుకులాలు, 4 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. గద్వాల జిల్లాలో హైస్కూల్స్, యూపీఎస్, కేజీబీవీలు మొత్తం కలిపి 496, ప్రభుత్వ ఎయిడెడ్ 2, 139 ప్రైవేట్ ఎయిడెడ్.. మొత్తంగా 640 పాఠశాలలు ఉండగా 1,22,980 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 641 ప్రైమరీ, 208 యూపీఎస్, 275 హైస్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా 14 కేజీబీవీలు, 6 గురుకులాలున్నాయి.