పెబ్బేరు, సెప్టెంబర్ 28ః ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా జరిగిన ఈ చోరీ అంతరాష్ట్ర దొంగల పనే అయిఉంటుందని పోలీసు లు నిర్దారణకు వచ్చారు. ఆ కోణంలోనే వారు దర్యా ప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ఏటీఎం ను గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించిన విధానం, వారు అను సరించిన పద్దతులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో, తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఏటీ ఎం దొంగతనాలను పోలీ ఉండటంతో ఆ దిశలో పోలీసులు దృష్టి సారించారు. దొంగలు అ త్యంత చాకచక్యంగా వ్యవహరించి తాము వినియోగించిన కారును పోలీసులు పట్టుకొనేందుకు వీలు లేకుండా .. ఓ కం టైనర్లోకి ఎక్కించి తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఈ తరహాలోనే ఆ ముఠా పలు చోరీ లకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే వారు దర్యాప్తు కొనసాగి స్తూ పలు రాష్ర్టా ల్లో దొంగల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలు స్తోంది.
పెబ్బేరులో ఎస్బీఐకి సంబంధించి రెండు ఏటీఎం కేంద్రాలున్నాయి. ఒకటి సుభాష్ చౌరస్తాలోని బ్యాంక్ భవనం కింది భాగంలో ఉండగా..మరొకటి బస్టాండు ఎదురుగా ఉంది. చోరీ జరిగింది మాత్రం బస్టాండు ఎదురుగా ఉన్న దాంట్లోనే. ప్రధాన ర హదారిపైనే ఉన్న ఈ ఏటీ ఎం కేం ద్రాన్ని దోచేందుకు దొంగలు ముదు గా రెక్కీ నిర్వహించినట్లు తె లు స్తోంది. 19వ తేదీన మధ్యాహ్నం బ్యాంకు సిబ్బంది వచ్చి ఏటీఎంలో నగదును జమ చేశారు. అదే రోజు రాత్రి దొంగలు చోరీకి పా ల్పడటం గమనార్హం. 20వ తేదీన సా యం త్రం గానీ బ్యాంకు అధికారుల కు అనుమానం రాలేదు.
దొంగలు కూడా చోరీకి పాల్ప డ్డ అనంతరం ఏటీఎం ఉన్న దు కాణం షట్టర్‌ను సగ భాగం కిందికి మూసి వెళ్లడం తో..ఖాతాదారులు కూడా అది రిపేరులో ఉందేమోనన్న భావనతో దాని జోలికి వెళ్లలేదు. ఏటీఎం నుం చి ఎలాంటి సం కేతాలు లేకపోవడంతో సాంకేతిక సమస్య వచ్చిందే మోన్న అనుమానంతో బ్యాంకు అధికారులు విష యాన్ని ఏటీ ఎం నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. దీంతో వారి సాం కేతిక బృందం వచ్చి చూడటంతో అప్పుడు గానీ చోరీ ఘటన వెలుగులోకి రాలేదు.
20వ తేదీ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ఏటీఎం చోరీ జరిగినట్లు సీసీ టీవీ పుటేజీల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓ కారులో నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి, కారును ఏటీఎం పక్క సం దులో ఆపినట్లు తెలిసింది. ముందుగా వా రు ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నల్లటి స్ప్రే కొట్టి, వైర్లు కత్తిరించినట్లు తెలుస్తోంది. వెంట తెచ్చు కున్న గ్యాస్‌కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్‌ను సునా యసం గా కత్తిరించి అందులోని మొత్తం డబ్బు ను తస్కరించారు.
మిషన్‌ను కత్తిరిస్తున్న సమయం లో వెలువడే నిప్పురవ్వలకు కరెన్సీ నోట్లు కాలిపో కుం డా మధ్య లో నీళ్లు పోస్తూ పూర్తిగా కత్తిరిం చినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అ లాగే, సీసీ కెమెరాలకు సంబంధించిన అన్ని పరికరాలను సైతం తమ వెంట తీసుకెళ్లి ఆ ధారాలు లేకుం డా చేశారు.అరగంటలో తమపని ముగించుకొని వా రు తిరిగి తాము వచ్చిన కారు లోనే పరారైనట్లు తెలుస్తోంది. కొంత దూరం వెళ్లాక ముందే ఏర్పాటు చేసుకున్న కంటైనర్‌లోకి కారును ఎక్కించి పోలీసులకు చిక్కే వీ లులేకుండా పలాయనం చిత్తగించినట్లు తెలుస్తోంది.