మాగనూరు (కృష్ణ) : మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపులో వేసిన ఇసుక డంపు(Sand dump ) ను తహసీల్దార్ సురేష్ ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీశైలం( RI Srisailam) 15 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేశారు. అదే ఇసుకను ఇందిరమ్మ ఇండ్లకు తరలించినట్లు ఆర్ఐ వెల్లడించారు. కాగా కృష్ణ మండల పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న అక్రమ ఇసుక డంపులపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణ మండల పరిధిలోని ఎస్ఎల్ఎన్ రైస్‌మిల్లులో అక్రమ ఇసుక డంపులు పెరిగిపోతున్నాయి. మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 50కి పైగా ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపు చేసి నిలువ ఉంచారు. ఇదే విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా రైస్ మిల్లు నిర్మాణం కోసం ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని ఇసుక డంపు చేసుకున్నారని వివరించారు.