కాంగ్రెస్ నేతల నోట రైతుబంధు మాట ‘రైతులకు భరోసా కల్పించాలి.. అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.. నిబంధనలు విధించొద్దు.. సాగు మొదట్లోనే సాయం అందాలి.. పదెకరాల్లోపు రైతులను, ఐటీ కడుతున్న వారిని సైతం అర్హులుగా గుర్తించాలి.. కేసీఆర్ ప్రభుత్వంలాగే సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి’.. అంటూ రైతులు మనోగతాన్ని వెల్లడించారు. రైతు భరోసాపై ప్రభుత్వం రైతులు, నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహించగా.. కర్షకులు హాజరై సమస్యలను ఏకరువు పెట్టారు. ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలని సర్కారుకు సూచించారు. పీఎం కిసాన్ సమస్యలపై నిలదీశారు.
మహబూబ్‌నగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు భరోసా కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబం ధు గురించి ప్రస్తావన చేయడం.. అది కాంగ్రెస్ నేతల నోటి వెంట రావడంతో అధికార యం త్రాంగం విస్తుపోయింది. రైతుబంధు మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన మండలకేంద్రాల్లోని రైతు వేదికల్లో అభిప్రాయ సేకరణను చేపట్టారు. ముందస్తుగా సమాచారం అందించి రైతులను సమీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌కు చెందిన మద్దతుదారులు చాలామంది హాజరయ్యారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా అభిప్రాయాలను వెల్లడించా రు. ధన్వాడ రైతు వేదికలో ఓ కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథ కం లాగానే రైతుభరోసా కార్యక్రమాన్ని వర్తింపజేయాలని కోరడం గమనార్హం. రైతులు పంట లు పండిస్తేనే దేశం బాగుపడుతుందని మిగతా రంగాలన్నీ పుంజుకుంటాయని అభిప్రాయం వ్యక్తమైంది. దీనికోసం అన్నదాతలను ఆదుకునే పథకాలు ఉంటే బాగుంటుందని, రైతుబంధు మాదిరిగానే రైతు భరోసాను బేషరతుగా అమ లు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారులు దీనిపై అభిప్రాయాలు సేకరించారు. కాగా రైతు భరోసాపై ఇప్పటికే రైతుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. నిబంధనల వి షయంలో ప్రభుత్వం రోజుకో
వానకాలం, యాసంగి సీజన్లకు అనువుగా రైతు భరోసాను రైతుబంధు మాదిరిగానే అమ లు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అన్నదాతలకు పెట్టుబడి సాయం సమయానికి అంది వ్యవసాయంపై ఆధారపడిన అనేక రంగాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని కుం డ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర ప్ర భుత్వం రైతు భరోసా కార్యక్రమంపై మాట త ప్పిందని విమర్శలు వస్తున్నాయని బీఆర్ఎస్ మద్దతుదారులు కొందరు నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జూన్, డిసెంబర్లో రైతుబంధుకు సంబంధించిన డబ్బులు పడేవని కాం గ్రెస్ అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తామ ని చెప్పి మాట తప్పిందని, ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకపోతే రైతులు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా రై తులు బ్యాంకుల్లో రూ.లక్ష రుణం తీసుకోవాల న్నా ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి అని, దీన్ని సాకుగా చూపి రైతు భరోసా అందకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శ లు వస్తున్నాయి. అందుకే బేషరతుగా రైతు భ రోసా అమలు చే యాలని మెజార్టీ రై తులు అభిప్రాయాల ను వెల్లడించారు. రై తుల అభిప్రాయాల ను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామ ని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు.
పదెకరాల వరకు రైతుభరోసా ఇవ్వాల్సిందే. రైతు భరోసాను ఎన్ని ఎకరాల భూమి ఉన్న వారికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం రైతు అభిప్రాయ సేకరణ హర్షించదగ్గ విషయం. మెజార్టీ రైతులు కోరుకుంటున్న విధంగా పదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు భరోసా వేయాలి. గతంలో రియల్ ఎస్టేట్‌గా మార్చిన భూములకు కూడా పెట్టుబడి సాయం పొందారు. అలాంటి భూములను సర్వే చేసి తొలగించి నిజమైన రైతులకు సాయం అందించాలి.