గోపాల్పేట,డిసెంబర్ 31: యాసంగి సీజన్లో పంటల పెట్టుబడికి రైతుబంధు సాయం అందుతుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని వేరుశనగ పంట పొలంలో రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నా రు. పెట్టుబడికి రంది లేకుండా సాయం అందజేస్తున్న తెలంగాణ సర్కార్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
వనపర్తి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : రైతుల మోముల్లో చిరునవ్వులు చిగురిస్తున్నా యి. రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. యాసంగి సాగుకు సమాయత్తమవుతున్న వేళ పెట్టుబడి పైసలు ముందస్తుగా అందడంతో ఎంతో భరోసా ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. యాసంగి నాట్లు హుషారుగా వేస్తున్నారు. అరకలు కట్టి పొలాలు దున్నుతూ సాగుకు సిద్ధమవుతున్నారు. వనపర్తి జిల్లాలో 1,62,863 మంది రైతులు ఉండగా, 1,62, 564 మందికి సంబంధించి బ్యాంకు వివరాలు అప్డేట్ అయ్యాయి. వీరికి రూ.178,14, 75,518 నిధులు జమ కానున్నాయి. కాగా, మొదటిరోజు 56,701 మంది రైతులకు రూ.15,50,09,495 ఖాతాల్లో జమకాగా, రెండోరోజు 24,234 మందికి రూ.6,50, 21,893, మూడో రోజు 15,725 మందికి రూ.30,28,15,598 నిధులు ఖాతాలో పడ్డాయి. నాలుగో రోజు 26,247 మంది ఖాతాలో రూ.57.17 కోట్లు జమయ్యాయి.
అప్పు కోసం చేయి చాపడం లేదు..
ఒకప్పుడు పంట వేయాలంటే అప్పు ఎక్కడ దొరుకుతుందా అని వెతికేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతుబంధు ఎలాగైనా వస్తది అనే ధీమా ఉన్నది. కేసీఆర్ సారు మనసున్న మహారాజు. కాల్వల ద్వారా చెరువులు, కుంటలను నింపడంతో చేతినిండా పనులు దొరుకుతున్నాయి. నాకు మూడు ఎకరాలు ఉన్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు డబ్బులతో వరి సాగు చేస్తున్నాను. మా లాంటి పేద రైతులకు రైతుబంధు ఎంతో ఆసరానిస్తున్నది. వరినాటు వేసే కూలీలకు, ఇతర ఖర్చులకు సర్కార్ చేసిన సాయం సరిపోతుంది. రైతుబంధు మొదలు పెట్టినప్పటి నుంచి మాకు ఎలాంటి ఢోకాలేదు. – లింగాల రాములు, రైతు, పాన్‌గల్
పెట్టుబడికి ఇబ్బంది లేదు..
ఏటా పంట సాగు చేసేందుకు ఎ క్కువ మొత్తంలో డబ్బు అవసరమయ్యేది. అప్పు కోసం సావుకార్ల దగ్గరికి తిరిగెటోళ్లం. రైతుబంధు వచ్చిన నాటి నుంచి అలాంటి ఇబ్బంది లే దు. యాసంగికి రైతుబంధు పడడం సంతోషంగా ఉంది. మాకున్న మామిడితోటలో అవసరమైన ఖర్చులకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మూడెకరాల మామిడితోటకు రైతుబంధు జమైంది. నా భార్య పేరు మీద ఉన్న రెండెకరాలకు కూడా రైతుబంధు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న సేవలను ఎప్పటికీ మరిచిపోలేం. – జయరాంరెడ్డి, అమ్మాయిపల్లి, చిన్నంబావి మండలం
నాలుగెకరాలకు రైతుబంధు పడ్డది
మా కుటుంబానికి నాలుగెకరాల భూమి ఉన్నది. వేర్వేరుగా పట్టా ఉన్న మా భూమికి రైతుబంధు డబ్బులు జమయ్యాయి. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి సాయం అందిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. రైతుబీమా, ఉచిత కరెంట్ వంటి వాటి వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నది. కాల్వలు, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో మంచిగా పంటలు పండుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు తీసుకుంటున్నది. దీంతో చాలా మంది రైతులకు ప్రయోజనం కలుగుతున్నది.
– చంద్రయ్య, రైతు, నందిమళ్లగడ్డ, వనపర్తి మండలం
పైసలు టైముకు పడుతున్నయి..
కేసీఆర్ పైసలు టైముకు పడుతున్నయి. పైరవీకార్లతోటి పనిలేకుం డా నేరుగా బ్యాంక్‌ల పడుతున్నా యి. ఏ పని కావాలన్నా మధ్యలోళ్లే సగంబడా తింటుండ్రి.. ఇప్పుడట్ల లేదు. ఇప్పటిదాకా ఇట్ల పైసలియ్య డం ఎప్పుడూ సూడలేదు.. కేసీఆర్ సారు శానా మంచిగా చేస్తుండు. మా లాంటి రైతులకు కేసీఆర్ దేవు డి లెక్క. ఆయనకు మా కష్టాలన్నీ తెలుసు. ఏడాదికి రెండుసార్లు ఎకరాకు రూ.10 వేలు ఇస్తుం డు. నాకు ఆనందంగా ఉంది. కేసీఆర్ సారుకు జన్మజన్మలా రుణపడి ఉంటాం. – అరుముల రాములు, రైతు, ఆత్మకూరు
పండగలన్నీ ఒకేసారి వచ్చినట్లుంది..
యాసంగి సాగు మొదలుపెడుతున్న సమయంలోనే పెట్టుబడి సా యం రావడం సంతోషంగా ఉన్న ది. రైతులకైతే కొత్తేడు, సంక్రాంతి పండుగ రెండూ ఇప్పుడే వచ్చినట్లు ఉన్నది. రైతుబంధుతో కమీషన్‌దారులు, బయట ఉండే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే బా ధ తప్పింది. రైతులను ఇంతకంటే బాగా అక్కున చేర్చుకునే పార్టీలు, పాలకులు ఎవ్వరూ దొరకరు.- తంగలగడ్డ వెంకటేశ్, రైతు, గట్టు
నాలుగో రోజు రైతుబంధు వివరాలు
వనపర్తి
రైతులు : 26,247 , అందిన సాయం రూ.57.17 కోట్లు
నారాయణపేట
రైతులు : 14,932 , అందిన సాయం రూ.33.85 కోట్లు
జోగుళాంబ గద్వాల
రైతులు : 1,08,059, అందిన సాయం రూ.81.50 కోట్లు
నాగర్‌కర్నూల్
రైతులు : 25,317 ,అందిన సాయం రూ.29.19 కోట్లు