ధరూరు, జూన్ 24 : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం వసతుల సంగతి అ టుంచితే కనీసం చదువు చెప్పేందుకు పంతులు లేని ప రిస్థితులు నెలకొన్నాయి. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు.. దీంతో చదువు చెప్పేదెవరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నా చేసిన ఘట న మండలంలోని ఓబులోనిపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు మాట్లాడుతూ ఓబులోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం దామోదర్గౌడ్తో పాటు ఒక్క ఉపాధ్యాయుడు చిరంజీవి నాయుడు మాత్రమే విధు లు నిర్వహిస్తున్నాడన్నారు. దామోదర్ వ్యక్తిగత కారణాలతో జనవరి నుంచి డ్యూటీకి రావడం లేదని ఆరోపించారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు దాదాపు 128 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల పునఃప్రారంభమైన నాటి నుంచి ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే చదువు చెబుతున్నారు. ఐదు నెలలుగా అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నా రు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవిం చేందుకు గ్రామస్తులంతా గద్వాలకు వెళ్లారు.
హెచ్ఎం పాఠశాలకు రాకపోవడం వాస్తవమే. వేతనం కూడా నిలిపివేశాం. సమస్యను గురించి డీఈవోకు రిపోర్ట్ పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బదిలీలు ఉన్నందున ఉపాధ్యాయులను పాఠశాలకు పంపించేలా చర్యలు చేపడుతాం.