మహబూబ్నగర్ టౌన్, మార్చి 6 : శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుం చి దాదాపు 256 ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ఇ ప్పటికే అన్ని డిపోల నుంచి ప్రారంభించిన ట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు బస్సులు నడుస్తాయ ని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.