ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సులన్నీ శనివారం మహబూబ్‌నగర్ సమీపంలోని అమిస్తాపూర్‌లో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి రైతు పండుగకు వివిధ గ్రామాలనుంచి జనాన్ని తరలించేందుకు బస్సులను కేటాయించారు. చాలా బస్సులు తెల్లవారుజామున బస్టాండ్లల్లోకి రాలేదు. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు.
ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కనిపించింది. బస్సుల్లేక హైదరాబాద్ సిటీ బస్సులను నడిపారు. అయినా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణ ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. కాగా సభకు పలు ప్రాంతాల్లో జనాదరణ కరువైంది. ఒక్కో బస్సులో 15 నుంచి 20 మంది మాత్రమే వెళ్లారు.