లింగాల, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇబ్బందులు త ప్పడం లేదు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుం చి బస్టాప్‌లో మహిళలు కనిపిస్తే డ్రైవర్లు బస్సులు ఆపడంలేదు. చేయి ఎత్తిన చోట బస్సు ఆపాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆర్టీసీ డ్రైవర్లు నిబంధనలు పాటించడం లే దు. ఈ క్రమంలో పలుచోట్ల మహిళలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అలాంటి ఘటనే మండలంలోని మాడాపూర్ స్టేజీ వద్ద చోటుచేసుకున్నది. మాడాపూర్, కోమటికుంట గ్రామాలకు చెందిన పలువురు మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి, అచ్చంపేట డిపో ల నుంచి తెలకపల్లి మీదుగా లింగాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. స్టేజీల వద్ద చెయ్యి ఎత్తినా డ్రైవర్లు బ స్సు ఆపడం లేదని వారు వాపోయారు. మహిళలను బస్సుల్లో ఫ్రీగా ఎక్కించుకోవాల్సి వస్తుందని, ఖాళీ బ స్సులు తిప్పుతున్నారన్నారు. మహిళలు కనిపిస్తే బస్సు లు ఆపకుండా వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చే శారు. లింగాలలో ఆదివారం సంత కావడంతో మాడాపూర్, కోమటికుంటకు చెందిన మహిళలు కూరగాయ లు కొనేందుకు మాడాపూర్ స్టేజీ వద్ద ఉదయం 11 గంటలకు వచ్చి నిల్చున్నారు. వచ్చిన బస్సు వచ్చినట్టు వెళ్తున్నాయే తప్పా ఒక్కటి కూడా ఆపలేదు. ఇలా సమ యం కాస్త మధ్యాహ్నం 3గంటలైంది. దీంతో విసుగు చెందిన సదరు మహిళలు ఆగ్రహంతో రహదారిపై రా ళ్లను అడ్డంగా ఉంచారు. దాదాపు నాలుగ గంటలు స్టేజీ వద్దే ఉన్న మహిళలు ప్రభుత్వంపై ఊగిపోయారు. ఫ్రీ గా బస్సులు నడుపుతున్నామని ప్రగల్బాలు పలుకుతు న్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేం పడుతున్న ఇబ్బందులు పట్టవా అని ప్రశ్నించారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఫ్రీ బస్సు ఎందుకేసిండు ఆయన (రేవంత్‌రెడ్డి).. అట్ల పెట్టకుం టే పైసల్తో పోతుంటి మి. నిన్న మొన్న చార్జి పెట్టుకొని తిరిగినం. ఇ ప్పుడు కూడా అట్లే పో తం. ఆటోలళ్ల స్టేజీకాడి కి వచ్చి లింగాలకు పో యి సంతల కూరగాయ లు తెచ్చుకుందామని వచ్చినం. నాలుగు గంటల సే పు ఎదురుచూసినం. ఎండకు ఎంతసేపు నిలబడాల. వచ్చిన బస్సులు వచ్చినట్టే ఆపకుండ పో తున్నరు. ఈ స్కీంతోన శానా తిప్పలైతుంది.