నాగర్కర్నూల్, జనవరి 23 : నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని మెడికల్ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెం దగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన మేరకు బిజినేపల్లి మండలం లింగసానిపల్లికి చెందిన భార్యాభర్తలు తిరుమలేశ్, లక్ష్మి నాగర్కర్నూల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
దీంతో తిరుమలేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, భా ర్య లక్ష్మి తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు ఆమెను నాగర్కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు.