గద్వాల, మార్చి 30 : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్‌రెడ్డిని త్వరలో నిరుద్యోగులు గల్లా పట్టి గద్దెను దింపుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్రనాయకులు కురువ పల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో నిర్వహించిన విద్యార్థుల, నిరుద్యోగుల పోరు దీక్షకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాంగ్రెస్ దోపిడీ దారులకు ఎలా దోచుకోవాలో అనే క్యాలెండర్ విడుదల చేశారని విమర్శించారు.
అసెంబ్లీలో అవినీతిపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, అయితే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్న గద్వాల ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాడని స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారని అలాంటప్పుడు ఇక్కడ జరుగుతున్న పోరు దీక్షలో ఎమ్మెల్యే ఎందుకు పా ల్గొనడం లేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ లో రోడ్లు వేయడానికి ఆంధ్రాకు చెందిన సీఎం రమేశ్‌కు రూ.4 వేల కోట్ల టెండర్ ఇక్కడి రేవంత్ సర్కారు ఇచ్చిందన్నారు. సీఎం బంధువు రమేశ్ రెడ్డి మైనింగ్ కోసం 10ఎకరాలు భూమి అడిగితే బంధు ప్రేమ తో 17 ఎకరాలు కేటాయించారని ఆ భూమి ప్రస్తుతం ఎకరా వంద కోట్లు పలుకుతుందని, ఎవడబ్బ సొమ్మని సీఎం ప్రభు త్వ భూమిని ఇష్టారీతిలో పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వర కు 127మంది విద్యార్థులు చనిపోయారని ఈ మరణాలకు రేవంత్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో వి ద్యార్థులు శవాలై ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా కేరళ ఎన్నికల ఖర్చుల కోసం పొంగులేటితో రూ.1000 కోట్లు కేరళకు పంపించారని ఆరోపించారు. విద్యార్థుల జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ 2.66లక్షల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని అయితే రెండున్నర ఏండ్లలో కేవలం 16వేల ఉద్యోగాలు ఇచ్చారని మిగతా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజ్ బకాయిలు రూ.10వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పోరు దీక్ష పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ, మండల స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. నడిగడ్డలో మొదలైన పోరు గర్జన ఇక రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పారు. నిరుద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కారు రూ.1.50లక్షల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు దోపిడి క్యాలెండర్ అమలు చేస్తూ అల్లుడు, తమ్ముళ్లు, పొంగులేటిలకు దోచి పెడుతున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసిందని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గనాయకుడు బాసు హనుమంతునాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల పోరు గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతుఊ నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. పేద విద్యార్థులకు బకాయిలు విడుదల చేయడంలో ప్రభు త్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న గద్వాల ఎమ్మెల్యే బడ్జెట్లో గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల ఎన్ని నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గద్వాలలో గత బీఆర్ఎస్ లో జరిగినా అభివృద్ధి తప్పా ఈ రెండేళ్లల్లో చేసిని అభివృద్ధి సున్నా అన్నారు.
రాష్ట్రంలో విద్యపై రేవం త్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏండ్ల లో కేవలం 16వేల వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. గత ప్ర భుత్వహయాంలో కొలువుల కోసం నోటిఫికేషన్లు వేస్తే ప్రస్తుత ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థు ల,నిరుద్యోగుల పోరుగర్జన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ , మాజీ జెడ్పీటీ సీ పద్మావెంకటేశ్వరరెడ్డి, కౌన్సిలర్లు జగదీశ్, పులిపాటి వెంకటేశ్, మోహన్‌యాదవ్, సం టెన్న, గోపాల్, నర్సింహులు బీఆర్ఎస్ నా యకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, చక్రధర్‌రావు, రాఘవేంద్రరెడ్డి, మోనేశ్, రా జు, భరత్, అంగడి బస్వరాజ్ వెంకటరామయ్యశెట్టి, ప్రేమలత, మధుకుమార్, అతికూర్ రహెమాన్ నిరుద్యోగులు పాల్గొన్నారు.