వనపర్తి, మార్చి 12 (నమ స్తే తెలంగాణ) : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూ ర్వకంగా కలిశారు. బీఆర్ఎస్- బీఎస్పీలు పార్లమెంట్ ఎన్నిక ల్లో కలిసి నడవాలని నిర్ణయించిన క్రమంలో ఇద్దరి కలయిక కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవలే ప్రవీణ్‌కుమార్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలవడం రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డిని కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఇరుపార్టీల ఓట్లను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా సింగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశా రు. అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్ర జలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, ఉన్నవాటికి కూడా కోత వి ధించడం వల్లే వ్యతిరేకత గూడుకట్టుకున్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి నడుద్దామని, కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుదామన్నారు. కాగా, ప్రవీణ్‌కుమార్ దంపతులను సింగిరెడ్డి దంపతులు సన్మానించారు.