బలమైన అభ్యర్థిగా బహుజన నేత
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు భారమైన ఏనుగు అంబారీని వీడి మ రింత వేగంగా చేరేందుకు కారెక్కారు. బీఆర్ఎస్ అ ధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ దండులో భాగమయ్యారు.
- గులాబీ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ఇక కారు గుర్తుపై కందనూలు బరిలో..
- బీజేపీ కుయుక్తులకు దీటుగా బదులు
- పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరింత బలం
- పార్టీ శ్రేణులు, దళిత నేతల్లో జోష్
నాగర్‌కర్నూల్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు భారమైన ఏనుగు అంబారీని వీడి మ రింత వేగంగా చేరేందుకు కారెక్కారు. బీఆర్ఎస్ అ ధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ దండులో భాగమయ్యారు. బహుజన వాదాన్ని బలోపేతం చేసేందు కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేస్తున్న అడుగులను కా షాయపార్టీ అడ్డుకోవడంతో దీటుగా బదులిస్తూ ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరడంతో ఆయన వర్గీయులతోపాటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ జోష్ నెలకొన్నది.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పు చ్చుకున్నారు. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థా నం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ సిద్ధమయ్యారు. అయితే కాషాయం పార్టీ బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తును భగ్నం చేసేలా కుట్రలకు పాల్పడింది. తెలంగాణలో దళిత, బహుజన వాదానికి గులాబీ పార్టీ తోడుగా నిలవడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీఆర్ఎస్ను బలహీనం చేసే కుట్రలో భాగంగా కమలం పార్టీ పొత్తుకు అడ్డురాగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దీటుగా బదులిచ్చారు. గత రెండు రోజుల కిందట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఎస్పీలో తనకు అండగా ని లిచిన శ్రేణులతోపాటుగా స్వేరో, దళితులు, మేధావులు, పలు ప్రజాసంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాబోయే కాలంలో దళిత బహుజన వాదానికి సవాల్ ఎదురుకానున్నది. దీన్ని ముందే గుర్తించిన ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చ ర్చించి తన అనుయాయుల సలహాలు, సూచనలతో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామంతో ఆయా పార్టీలకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్లయ్యింది. కేసీఆర్, ఆర్ఎస్పీ చాణక్యంతో కాంగ్రెస్, బీజేపీల్లో అయోమయం నెలకొంది.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ ని ర్ణయంతో నాగర్‌కర్నూల్‌తోపాటు రాష్ట్రంలోనూ బీఆర్ఎస్కు మరింత అదనపు బలం తోడు కాను న్నది. దళిత బహుజన వాదులంతా కేసీఆర్, ఆర్ఎస్పీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. పార్లమెంట్లాంటి దేశ అత్యున్నత సభలో బహుజన మేధావి ఆర్ఎస్పీ ఉంటే ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు. కాగా కారు గుర్తు పోటీలో ఉండదేమోనని భావించిన బీఆర్ఎస్ శ్రేణులకు ఆర్ఎస్పీ చేరిక కొత్త జోష్ నింపింది. తమ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్పీని స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకంటే బలమైన అభ్యర్థిగా గులాబీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ నిలువబోతున్నారు. రాష్ట్రస్థాయిలో పేరు న్న ఆర్ఎస్పీ నాగర్‌కర్నూల్ బరిలో నిలవడంతో ఆ యన అభిమానులు, స్వేరో బలగం, దళిత బహుజ న ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆర్ఎస్పీని ప్రశంసిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో కారు పార్టీ బలంగా ఉండడం, ఎంతో పేరున్న ఆర్ఎస్పీ పోటీ చేయడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోనుందనే ఆనందం గులాబీ శ్రేణుల్లో నెలకొన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

