అలంపూర్: మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 (National Highway) పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణ ప్రాంతంలో పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్వంత గ్రామానికి ఆటో( Auto ) వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా గాయపడ్డవారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.