మాగనూరు (కృష్ణ) : మండలంలోని కృష్ణ-దేవసూర్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ ( SI Naveed) తెలిపిన వివరాల మేరకు సుగురెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై దేవసూర్ వైపు అతివేగంగా వెళ్తూ కర్ణాటక బస్సును ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో సుగురెడ్డికి రెండు కాళ్లు విరిగిపోయాయి. అంబులెన్స్ సిబ్బంది అతడిని రాయచూర్ రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వివరించారు.