మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 14 : నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన తరుణ్‌సాయి 550, స్వర్ణకుమారి 545, వినయ్ 525తోపాటు మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ భూపాల్‌రెడ్డి, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి, రాఘవేంద్రరావు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న టీ.తరుణ్‌సాయి 550 మార్కులు సాధించి నీట్లో 12,286 ర్యాంకు సాధించారు. స్వస్థలం తాండూరు. నాన్న ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, అమ్మ ప్రైవేట్ టీచర్. కార్డియాలజిస్టు కావడమే లక్ష్యమని సాయితరుణ్ పేర్కొన్నాడు.