వనపర్తి టౌన్, సెప్టెంబర్ 11 : గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హే మంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు కొలువుల కోసం ఏండ్ల తరబడి కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే పరీక్షలు నిర్వహించడం సర్కారు చేతకాకపోవడం విచారకరమన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలు ఎవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలపై నిలదీయాలన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏ ర్పాటు చేసి హామీలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు భాగ్యరాజ్, మ హిళా నాయకురాలు కవితానాయక్, లక్ష్మణ్, శివ, శంకర్, మన్సూర్, రాజేశ్, చంద్రశేఖర్, హుస్సేన్, రాము, వెంకట్సాగర్, ప్రేమ్, అలీం తదితరులు పాల్గొన్నారు.