మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మద్దూరు: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియో జకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కనీవిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. ఈ రైతు నిరసన దీక్షను భగ్నం చేయాలని కాంగ్రెస్ నాయకులు పన్నిన కుట్రలను ఛేదించుకుంటూ భారీ ఎత్తున రైతు లు తరలివచ్చారు. కేటీఆర్ సభకు వెళ్లొద్దంటూ చాలా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
చికెన్, మటన్ బిర్యానీలు పెట్టినా అక్కడ తిని కేటీఆర్ సభకు రావడంతో కంగుతిన్నారు. బీఆర్ఎస్ రైతు మహాధర్నా సక్సెస్ఫుల్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అరాచకాలను కేటీఆర్ దుమ్మెత్తి పోశారు. కొడంగల్ జనంపై ప్రేమ లేదని.. కేవలం ఆయన అల్లుడికి, ఆదానికి, కుటుంబ సభ్యులకు దోచి పెట్టేందుకే గిరిజనుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం కదలకపోవడం గమనార్హం. మధ్యాహ్నం ఒంటి గంట కు రైతుదీక్ష ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ 12గంటలకే రైతులు, మహిళలు పెద్దఎత్తున సభా ప్రాం గణానికి తరలివచ్చారు. ఒంటి గంటకే సభా ప్రాంగణ మొత్తం నిండిపోయింది. మరోవైపు కేటీఆర్ రాకకోసం కోస్గి పట్టణ శివారులో వేలాదిమంది రైతులు ఎదురు చూస్తున్నారు.
సరిగ్గా మధ్యాహ్నం 3గంటలకు కేటీఆర్ లగచర్ల రైతులకు హకీంపేటలో సంఘీభావం ప్రకటి ంచారు. అక్కడి నుంచి మొదలైన కేటీఆర్ ర్యాలీ సభకు వచ్చేవరకు 45 నిమి షాలు పట్టింది. ఎక్కడ చూసినా జనమే జనం. కేటీఆర్‌కు ఘ న స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. దారి పొడవునా పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోస్గిలోని శివాజీ చౌక్‌లో కేటీఆర్‌కు భారీ గజమాలను వేశారు. డప్పులు, డాన్సులు చేసుకుంటూ కేటీఆర్‌ను తీసుకొచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా రైతా ంగం మొత్తం రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సభా ప్రాంగణానికి చేరుకున్న కేటీఆర్ వేదిక మీదికి రావడానికి పదినిమిషాలు పట్టింది. అడు గడుగునా రైతులు, కార్యకర్తలు అభిమానం చూపించ డంతో వేదిక ఎక్కడానికి సమయం పట్టింది.
కోస్గి మొత్తం జనసంద్రంగా మారడంతో కేటీఆర్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. మహిళలు సైతం ఎదురు వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో సభా వేదికకు చేరుకున్న కేటీఆర్‌కు కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆయన చెయ్యిని చాలామంది పట్టుకొని షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నిస్తు ండడంతో ఓ కార్యకర్త గోరు తగిలి కేటీఆర్‌కు స్వల్ప గాయమైంది. రక్తం కారుతుండడంతో అలాగే వేదికపైకి వచ్చి.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రా రెడ్డికి గాయాలు చూపించారు. తనకు గాయమైన విష యాన్ని కూడా కేటీఆర్ సభా వేదికపై ప్రస్తావించారు.
కోస్గి నిరసన దీక్షకు పోలీసులు భారీ ఎత్తున మొ హరించారు. కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ ఎం ట్రీ అయినప్పటి నుంచి స భా వేదిక వద్ద వచ్చేవరకు పెద్ద సంఖ్యలో పోలీసు లు మో హరించారు. లగచర్లకు వెళ్లకుండా భారీకేడ్లు అడ్డం పెట్టారు. అయితే లగచర్ల బాధితులంతా హకీంపేట వద్ద టెంటు వేసుకొని కేటీఆర్‌కు ఘన స్వాగతం పలి కారు. మా భూములు మా నుంచి పోకుండా కాపా డండి సారు అంటూ గిరిజనులు వేడుకున్నారు. పోలీ సు యంత్రాంగాన్ని భారీ ఎత్తున కొడంగల్ నియోజక వర్గంలో డిప్లయ్ చేశారు. అయినప్పటికీ కార్యకర్తలు ఎక్కడ సంయమనం కోల్పోలేదు.
సీఎం రేవంత్ భూ దాహానికి ఎగిసిపడ్డ గిరిజన బిడ్డల పోరాటానికి మొక్కవోని దీక్షతో అడుగులో అడుగు వేసిన ఆ ఉద్యమ చైతన్య దీపిక పేరు జ్యోతి.. నిండు గర్భిణి అయిన జ్యోతి భూముల కోసం కలిసి కదం తొక్కినా కనికరించని సర్కార్ గిరిజనులపై అక్ర మ కేసులు బనాయించి జైలుపాలు చేశారు. నెలలు నిండిన బిడ్డకు జన్మనిచ్చే టైంలో.. భర్తను జైలు పాలు చేసినా పోరాటాన్ని ఆపలేదు. ప్రభుత్వ దమన నీతిని ప్రశ్నించింది. ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసి గిరిజనుల తరఫున గళం విప్పింది. ఇటీవల జ్యోతి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఏ భూమి కోసం పోరాడిందో అ భూమిని తమ నుంచి వేరు చేయొద్దని తనబిడ్డకు అభి మాన నాయకుడు కేటీఆర్‌తో పాక్లావత్ భూమి నా యక్గా నామకరణం చేయించి చరిత్ర తిరగ రాసిం ది. ఈ ఘట్టం లగచర్ల పోరాటానికి ఊపిరిపోసింది.
మా భూముల జోలికి వస్తే సహించేది లేదు.. ఎక్కడో ఉండి కాదు ఇక్కడికి వచ్చి మా జనాల మధ్య వచ్చి భూములు కావాలని అడుగు.. మేము ఇస్తామా? లేదా తర్వాత విషయం.. మేం మీకు ఓట్లు వేశాం మా బాధలు మీకు కనిపించడం లేదా? అంటూ రోటిబండ తండాకు చెందిన విద్యార్థిని మంజుల రైతు నిరసన దీక్షలో సీఎం రేవంత్‌ను నిలదీసింది. ఓట్లు వేయని వాళ్లు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు.. నీవు ఎక్కడున్నావ్ సార్ అంటూ గట్టిగా నిలదీసింది.
మీరు పెట్టిన కేసులో మా నాన్న ఇరుక్కున్నాడని వాపోయింది. .. అలాగే రోటిబండ తండాకు చెందిన మరో విద్యార్థిని పూజ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సార్ ప్రజల బాధలు మీకు కనిపిస్తున్నాయా..? మీరు చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని ఆక్రోశం వెల్లగక్కింది. నీ మాటలన్నీ అబద్ధాలే.. మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు.. మా కష్టం బాధను తెలుసుకున్న మా అన్న కేటీఆర్.. మమ్మల్ని ఆదుకున్నాడంటూ మాట్లాడింది. రేవంత్ సార్ మీకు ఓట్లేసినం మీరు ఎప్పుడైనా మా బాధలు గమనించారా? అంటూ నిలదీసింది.